వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం | YS Jagan To Hold Key Zoom Meeting With Party Leaders Over Drought And Water Shortage, Check Out Highlights Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం

Sep 17 2026 10:55 AM | Updated on Sep 17 2026 1:18 PM

YS Jagan Zoom Meeting With Party Key Leaders speech News Updates

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

జూమ్‌ ద్వారా జరుగుతున్న ఈ మీటింగ్‌లో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. కరువు పరిస్థితులు, పలు ప్రాంతాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై నేతల నుంచి వివరాలను వైఎస్‌ జగన్‌ అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ప్రజలకు ఎదురవుతున్న ఇతర సమస్యలు, ఆయా జిల్లాల్లోని తాజా పరిస్థితులపైనా పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. 

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి.. వాటిపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల వారీగా పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, స్థానికంగా పార్టీ కార్యకలాపాలపై కూడా నేతలతో జగన్‌ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కొండ పైనా క్రెడిట్‌ చోరీనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement