సాక్షి, తాడేపల్లి: విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విరాట్ విశ్వకర్మ భగవాన్, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం వైఎస్ జగన్ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు ఎస్.ఎం. పవిత్ర, తోలేటి శ్రీకాంత్, విశ్వబ్రాహ్మణ నాయకులు ఎస్.డి. మురళీకృష్ణ, కె. గురవాచారి, ఉదయ్‌కుమార్, శేఖర్ పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.


