
గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొననున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. వినాయక చవితి సందర్భంగా విజయవాడ రాణిగారి తోటలో జరిగే గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ రాణిగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
వైఎస్ జగన్‌ను వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావులు తాడేపల్లిలో మంగళవారం కలిశారు. చవితి వేడుకలను పురస్కరించుకుని వినాయకుడి మట్టి ప్రతిమను అందజేశారు. రాణిగారితోటలో నిర్వహించే చవితి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.