నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు | YS Jagan Attend Akepati Wedding Reception In Annamayya District Rajampet, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు

Aug 19 2025 12:36 PM | Updated on Aug 19 2025 1:50 PM

YS Jagan Attend Akepati Wedding Reception In Annamayya District

సాక్షి, అన్నమయ్య: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంట శుభకార్యం జరగగా.. ఆ వివాహ రిస్పెప్షన్‌కు హాజరైన వైఎస్‌ జగన్‌ నూతన వధువరులను ఆశీర్వదించారాయన. 

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు అనురాగ్‌ రెడ్డి వివాహం వరదీక్షిత రెడ్డితో జరిగింది. ఈ వివాహ రిసెప్షన్‌కు వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. హెలిపాడ్ నుంచి వివాహ వేదిక వరకు పెద్దఎత్తున అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అందరికీ ఆప్యాయంగా అభివాదం చేస్తూ జగన్‌ ముందుకు కదిలారు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement