
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజంపేట మండలం బాలిరెడ్డిగారిపల్లికి చేరుకొని.. అక్కడి నుంచి ఆకేపాడుకు వెళ్తారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో ఆయన పాల్గొంటారు.