సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27, 28 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) పులివెందులలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. బుధవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.


