కూటమిలో | - | Sakshi
Sakshi News home page

కూటమిలో

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

కడప మేయర్‌ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీడీపీ అడ్డదారులు ఎంచుకుంది. వార్డుల రిజర్వేషన్ల కేటాయింపు మొదలు.. నిన్నటి నామినేషన్ల పరిశీలన వరకు అడుగడుగునా కుట్రలు పన్నింది. ‘అధికార’బలంతో పలు వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. ఇదే పద్ధతిలో ‘మేయర్‌’సీటును ఏకగ్రీవం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు ‘పోటీ’ అనివార్యం కావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతుల వ్యవహారశైలి కూటమిలో కుంపట్లు రాజేసింది.

సాక్షి ప్రతినిధి, కడప: ‘ఎన్నికలం’టే చాలు కూటమి గుండెల్లో గుబులుపుడుతోంది. ‘బ్యాలెట్‌’ వార్‌లో దిగాలంటే భయపడుతోంది. రెండున్నరేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కడప నగరాభివృద్ధి దిగజారింది. ఇక స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి, వాసు దంపతుల వ్యవహారశైలికి ప్రజలకే కాదు ఆ పార్టీ నేతలకూ విసుగొచ్చింది. ప్రస్తుత టీడీపీ మేయర్‌ అభ్యర్థికి ఇదే ప్రతిబంధకంగా మారిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. పార్టీ సీనియర్‌ నేతలపై మాధవిరెడ్డి అగౌరవం, సామాజిక సమీకరణపై అత్యంత నిర్లక్ష్యం, ముస్లిం మైనార్టీ వర్గాల అణిచివేత, ఆర్థిక స్థోమత మినహా పార్టీ కండువా ఏనాడు కప్పుకొని మహిళ అభ్యర్థిత్వం ఖరారు, ఇవన్నీ టీడీపీ మేయర్‌ ఎన్నికకు ఆ పార్టీలో ప్రతిబంధంకంగా మారాయి. కడప నగరంలో మూడు దశాబ్దాలుగా లేని హింస నామినేషన్ల పర్వంలో తలెత్తింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రజా స్వామ్యబద్ధంగా పోలింగ్‌ నిర్వహిస్తే టీడీపీ అడ్రసు గల్లంతు కాక తప్పదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

● అధికారాన్ని అడ్డుపెట్టుకొని 51డివిజన్ల కార్పొరేటర్లను కూటమి నేతలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఇందులో పోలీసులు ప్రత్యక్ష, పరోక్ష సహకారమే అత్యధి కం. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకొని ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి బరిలో నిలిచారు. మరో 15 కార్పొరేటర్లకు మేయర్‌ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీకి పోలింగ్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఏ విషయంలోనూ సీనియర్లును పరిగణలోకి తీసుకోకపోవడం, పైగా ‘సీనియర్లు లేరు, తొక్కాలేర’ని బాహాటంగా వ్యాఖ్యానించడం, నగర మాజీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై ప్రత్యక్షదాడితో మొదలు, తాజాగా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన జిలానీబాషా వర కూ నాయకుల మనస్సులు గాయపడ్డాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసినోళ్లు కనుచూపు మేర కన్పించడం లేదు. ఈపరిస్థితుల్లో కడప నగరంలో టీడీపీపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

మేయర్‌ అభ్యర్థిపై టీడీపీ సీనియర్ల విసుర్లు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డగింతలో పెచ్చుమీరిన హింస

రెండేళ్లు టీడీపీ పాలనలో

విసిగిపోయిన నగర ప్రజానీకం

పోలింగ్‌ ప్రజాస్వామ్యబద్ధంగా

నిర్వహిస్తే ‘సైకిల్‌’అడ్రసు గల్లంతు

ప్రచారంలో దూసుకుపోతున్న

వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి దీప్తిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement