నేడు పులివెందులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పులివెందులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

ప్రజలతో మమేకం కానున్న జననేత

పులివెందుల : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పులివెందులకు రానున్నారు. ఉదయం 9గంటలకు బెంగుళూరు యలహంకలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9.20 గంటలకు జక్కూర్‌ ఎయిర్‌డ్రోంకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 10.20గంటలకు భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 10.35గంటలకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 10.35 గంటల నుంచి సాయంత్రం 6గంటలకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమవుతారు. అనంతరం పులివెందుల్లోని తన నివాసంలో బస చేస్తారు. బుధవారం ఉదయం 8గంటలకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement