రాత్రిపూట గస్తీ ముమ్మరం చేయండి | - | Sakshi
Sakshi News home page

రాత్రిపూట గస్తీ ముమ్మరం చేయండి

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

కడప అర్బన్‌: ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ సోమవారం ఉదయం కడప టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో జరగనున్న అభ్యర్థుల ప్రచారం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేయాలని, రాత్రి పూట గస్తీ, తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ టి. భవాని, టూ టౌన్‌ సీఐ శ్రీహరి, ఎస్‌ఐలు కొండారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఐదేళ్ల ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలు

కడప ఎడ్యుకేషన్‌ : యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్‌ సైన్స్‌ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ అప్లైడ్‌ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య వి.రామకష్ణ తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 27 లోపు ఓఏఎండీసీ వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని అలాగే వైవీయూ కళాశాల వెబ్‌ ఆప్షన్స్‌ చేసుకోవాలని తెలిపారు. ఇతర సందేహాలకు 9985442196, 88867 69949 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

అవినీతికి పాల్పడే వారిపై ఏసీబీకి ఫిర్యాదు చేయండి

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్‌ చేసినా, అవినీతికి పాల్పడినా ప్రజలు నిర్భయంగా అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సూచించారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్‌ను సోమవారం శ్రీధర్‌ చెరుకూ రి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064తో పాటు, వాట్సాప్‌ నంబర్‌ 94404 40057 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చనే విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. కడప రేంజ్‌ ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.వి. నాగరాజు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement