నాడు వెలుగు పథం... నేడు చంద్రగ్రహణం! | - | Sakshi
Sakshi News home page

నాడు వెలుగు పథం... నేడు చంద్రగ్రహణం!

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

● ‘కుర్చీ’పైనే ధ్యాసంతా .. పాలనంతా ‘చెత్త’

కూటమి కొలువుదీరాక నగరాభివృద్ధి ‘దారి’తప్పింది. పాలకుల దృష్టంతా ‘కార్పొరేషన్‌లో కుర్చీ’పైనే పడింది. ఇంకేముంది పాలన పడకేసింది. ‘స్వచ్ఛ కడప’ అంటూ ఊదరగొట్టినా అది ప్రకటనకే పరిమితైంది. అంతేనా ఏకంగా మేయర్‌ ఇంటిపైనే చెత్త వేసే విష సంస్కృతి మొదలైంది..‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా కిందిస్థాయి సిబ్బందిలోనూ నిండా నిర్లక్ష్యం ఆవహించింది. ఫలితంగా ఇదిగో ఇలా నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.. మురుగుపారక కాలువలు అధ్వానంగా మారాయి. ఇక పలు కాలనీల్లో గుంతలు తేలిన రోడ్లు దర్శనమిస్తున్నాయి.

● అభివృద్ధికి ‘రహదారి’

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు తీసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపలో ఏడు ప్రధాన రహదారులను విస్తరించారు. వీటిలో అతి ముఖ్యమైనది అంబేడ్కర్‌ సర్కిల్‌– వై జంక్షన్‌ రోడ్డు. ఇది గతంలో సింగిల్‌ లేన్‌ రహదారిగా ఉండేది. ట్రాఫిక్‌ ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కోట్లు ఖర్చు చేసి అంబేడ్కర్‌ సర్కిల్‌ను ఆధునికీకరించడంతోపాటు వై జంక్షన్‌ వరకూ రహదారి విస్తరణ చేపట్టారు. విస్తరణ వల్ల నష్టపోయిన వారికి పరిహారమూ చెల్లించారు. వై జంక్షన్‌లో అశోక చక్రం, నాలుగు సింహాల ప్రతిమలను అందంగా ఏర్పాటు చేశారు. రహదారి విస్తరించడంతో ఈ మార్గంలో జుడియో, ఓన్డ్‌, రివర్‌ వంటి, అన్‌ లిమిటెడ్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement