రేపు ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌ | YS Jagan Three Days Tour In YSR District On Oct 29th | Sakshi
Sakshi News home page

రేపు ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

Oct 28 2024 6:35 PM | Updated on Oct 28 2024 6:49 PM

YS Jagan Three Days Tour In YSR District On Oct 29th

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు(మంగళవారం) వైఎస్సార్‌ జిల్లాకు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి వైఎస్‌ జగన్‌.. మొదట ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం పులివెందులకు వెళ్తారు.

వైఎస్‌ జగన్‌ రేపు వైఎస్సార్‌ జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు వైఎస్‌ జగన్‌ అందుబాటులో ఉంటారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement