భగత్‌ సింగ్‌ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు | YS Jagan Pays Tributes To Bhagat Singh | Sakshi
Sakshi News home page

భగత్‌ సింగ్‌ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు

Sep 28 2026 10:33 AM | Updated on Sep 28 2026 10:33 AM

YS Jagan Pays Tributes To Bhagat Singh

సాక్షి, తాడేపల్లి: నేడు భగత్‌ సింగ్‌ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. భగత్‌ సింగ్‌కు నివాళి అర్పించారు.  బ్రిటిష్‌ పాలనను ధైర్యంగా ఎదిరించిన ఆయన పోరాట స్ఫూర్తి, దేశభక్తి తరతరాలకు మార్గదర్శకమని కొనియాడారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ ఎక్స్‌ వేదికగా..‘దేశం కోసం జీవించడం అంటే ఏమిటో.. మాతృభూమి స్వేచ్ఛ కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడం ఎంత గొప్పదో.. తన జీవితంతో చాటిన అమరవీరుడు భగత్‌ సింగ్‌. బ్రిటిష్‌ పాలనను ధైర్యంగా ఎదిరించిన ఆయన పోరాట స్ఫూర్తి, దేశభక్తి తరతరాలకు మార్గదర్శకం. ఆ మహావీరుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. 

ఇదీ చదవండి: చంద్రబాబు సర్కార్‌ మరో దుర్మార్గం.. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement