
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్థంతి. ఈ సందర్భంగా వాజపేయికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారు. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/9xx6tDtAJM
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025