సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజాసమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతోపాటు స్థానిక రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు.


