జబల్‌పూర్‌ ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ విచారం | YS Jagan expressed his sorrow about Jabalpur Accident | Sakshi
Sakshi News home page

జబల్‌పూర్‌ ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ విచారం

Feb 11 2025 2:22 PM | Updated on Feb 11 2025 2:59 PM

YS Jagan expressed his sorrow about Jabalpur Accident

తాడేపల్లి, సాక్షి: మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ జిల్లా సిహోరాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న హైదరాబాద్‌ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే.  

తెలుగు భక్తులు మృతి చెందటంపై వైఎస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను వెంటనే ప్రభుత్వాలు ఆదుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

హైదరాబాద్‌ నాచారం నుంచి కొందరు భక్తులు మినీ బస్సుల్లో ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు ముగించుకుని తిరిగి వస్తుండగా.. సిహోరా వద్ద 30వ నెంబర్‌ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement