భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulations To Winner Team India | Sakshi
Sakshi News home page

భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్‌ జగన్‌ అభినందనలు

Mar 10 2025 7:18 AM | Updated on Mar 10 2025 7:47 AM

YS Jagan Congratulations To Winner Team India

సాక్షి, తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని చెప్పుకొచ్చారు.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement