
సాక్షి,తాడేపల్లి: 'పద్మ’ పురస్కార గ్రహీతలకు వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తమ రంగాల్లో విశిష్ట సేవలందించి పద్మ అవార్డులు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డులు స్వీకరించిన మంద కృష్ణమాదిగ, కేఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.
ఇవాళ పద్మ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహితలకు పద్మ పురస్కారాలను అందజేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే, ఏపీ నుంచి వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.