ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్‌ మృతిపై వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Condoles The Death Of Renowned Director Bhagyaraj | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్‌ మృతిపై వైఎస్‌ జగన్‌ సంతాపం

Jun 27 2026 4:11 PM | Updated on Jun 27 2026 4:22 PM

YS Jagan Condoles The Death Of Renowned Director Bhagyaraj

సాక్షి, తాడేపల్లి: ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రచయితగా, సహాయ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించి.. తన ప్రతిభతో తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా భాగ్యరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. భాగ్యరాజ్ భారతీయ సినీ రంగంపై చెరగని ముద్ర వేశారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘ఆయన దర్శకత్వం వహించిన, కథ-స్క్రీన్‌ప్లే అందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఘన విజయాలు సాధించాయి. ప్రేమ, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను తన చిత్రాల్లో హృద్యంగా ఆవిష్కరించారు. భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని  ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement