కరణం వారి పెళ్లి సందడి

YS Jagan Attend MLA Karanam Dharmasris Daughter Wedding - Sakshi

వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు ఆత్మీయ పలకరింపు 

విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుకకు నగరానికి శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డుమార్గంలో బీచ్‌రోడ్డులోని కల్యాణ వేదిక పార్క్‌ హోటల్‌లో వివాహానికి సాయంత్రం 6.06 గంటలకు హాజరయ్యారు.

వధూవరులను ఆశీర్వదించి తిరిగి 6.50 విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్‌ వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి రంగారావు, ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, జేసీ వేణుగోపాల్‌రెడ్డి వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వల్లభనేని బాలశౌరి, సీఎం ప్రోగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలసిల రఘురాం తదితరులు ఉన్నారు. 

ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, ఉమాశంకర్‌ గణేష్‌లను పలకరిస్తున్న సీఎంవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిత్రంలో మంత్రి ముత్తంశెట్టి
తరలివచ్చిన నేతలు 
విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చారు. స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్‌ గణేష్, గొల్ల బాబురావు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, వాసుపల్లి గణేష్‌కుమార్, జక్కంపూడి రాజా, పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, సమన్వయకర్తలు కె.కె రాజు, అక్కరమాని విజయనిర్మల, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్, మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు, పార్టీ సీనియర్‌ నేతలు సీతంరాజు సుధాకర్, జాన్‌వెస్లీ, వరుదు కల్యాణి, తుల్లి చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ, చిత్రంలో ఎమ్మెల్యే అమర్‌నాథ్, తదితరులు
వేదిక వద్ద సందడి  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకావడంతో వివాహ వేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. వధూవరులు సుమ, చిన్నంనాయడుకు సీఎం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా.. వారు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ కుటుంబసభ్యులతో వేదికపైనే కాసేపు మాట్లాడిన సీఎం, వివాహానికి హాజరైన పార్టీ శ్రేణులందర్నీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, ఎంపీలు గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నా«థ్, కె.భాగ్యలక్ష్మి, కన్నబాబురాజు, బొత్స అప్పలనర్సయ్య, సంబంగి వెంకటచిన అప్పలనాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, గొర్లె కిరణ్, కడుబండి శ్రీనివాసరావు, రాపాక వరప్రసాద్, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ సీనియర్‌ నాయకులు సూర్య నారాయణ రాజు, కుంభా రవిబాబు, తిప్పల గురు మూర్తి రెడ్డి, కిల్లి కృపారాణి, పక్కి దివాకర్, తైనాల విజయ్‌కుమార్‌ తదితరులు వధూవరులను ఆశీర్వదించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top