దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా?.వైఎస్‌ జగన్‌ | Ys Jagan For Ap Govt Over Power Charges Hike | Sakshi
Sakshi News home page

దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా?.వైఎస్‌ జగన్‌

Oct 27 2024 5:15 PM | Updated on Oct 27 2024 5:49 PM

Ys Jagan For Ap Govt Over Power Charges Hike

సాక్షి,తాడేపల్లి : ‘కరెంట్‌ చార్జీలు పెంచడమేనా, ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక’ అంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్విట్‌ చేశారు.  

‘కరెంట్‌ ఛార్జీలు పెంచడమేనా, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక.. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే విద్యుత్‌ ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో మీరిచ్చిన హామీ ఏమైంది చంద్రబాబు? టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్తు ఛార్జీలను తగ్గించే వాళ్లం అని చెప్పిన మీరు ప్రజలు ఎంత వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా చంద్రబాబూ? 

ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు, ఈ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది. ప్రజలపై అదనపు ఛార్జీలను వేయడమేనా మీ విజన్‌. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో విద్యుత్‌ ఛార్జీలు పెంచి మాట తప్పడమే మీ నైజమని మరోసారి రుజువు చేశారు.’ అంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement