శా‘స్త్రీ’య జయభేరి | Women empowerment at Central Tribal University | Sakshi
Sakshi News home page

శా‘స్త్రీ’య జయభేరి

Jul 1 2026 4:51 AM | Updated on Jul 1 2026 4:51 AM

Women empowerment at Central Tribal University

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో మహిళా సాధికారత

పట్టాలు తీసుకున్న వారిలో 46 శాతం మహిళలు కావడం విశేషం

బంగారు పతకాలు సాధించిన వారిలో 70% మహిళలు ఉండటం గర్వకారణం

‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ హబ్‌ ఏర్పాటు శుభపరిణామం  

గిరిజనుల జీవనోపాధి మెరుగుపరిచే ఆవిష్కరణలు రావాలి

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

సాక్షి, విశాఖపట్నం: విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయ్యాక సమాజం, దేశ భవిష్యత్తును మెరుగుప రచడానికి కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలు పునిచ్చారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విశాఖ పట్నంలో మంగళవారం నిర్వహించిన తొలి స్నాతకోత్స వంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ‘స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన విద్యార్థులలో సుమారు 46 శాతం మహిళలు ఉండగా.. బంగారు పతకాలు సాధించిన వారిలో 70 శాతం మంది బాలికలే ఉండటం గర్వంగా ఉంది. 

ఈ కార్యక్రమంలోనే మహిళా సాధికారత స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజన జీవనోపాధి పెంచే ఆవిష్కరణలు ఈ వర్సిటీ నుంచి రావాలి.  ఉత్తరాంధ్ర గిరిజన సమాజ సాధికారత కోసం వర్సిటీ ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ హబ్‌ ఏర్పాటు చేయడం హర్షణీయం.  మా ఊరిలో నేనే మొదటి పట్టభద్రురాలిని. ఈ రోజు స్నాతకోత్సవంలో ఉన్న విద్యార్థులలోనూ కొందరు తమ కుటుంబంలో మొదటి గ్రాడ్యుయేట్లు అయి ఉండొచ్చు. మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోండి.’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.

వికసిత్‌ భారత్‌ సాధనలో కీలక పాత్ర పోషించాలి   
వర్సిటీ శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన క్షణాలను తాను గుర్తుచేసుకున్నాననని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాడిన ఈ గడ్డపై విద్యనభ్యసించిన యువత ‘వికసిత్‌ భారత్‌’ సాధనలో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.  2019లో ఏర్పాటైన యూనివర్సిటీ ఏపీతోపాటు  ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యా కలలను సాకారం చేస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కొనియా డారు. పాఠ్యాంశాల్లో బహుభాషా విధానాన్ని పొందుపరచాలని గవర్నర్‌ సూచించారు. 

అనంతరం 2020 నుంచి 2026 వరకూ వివిధ బ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో పాటు గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణిని యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ శ్రీనివాసన్‌ ఆత్మీయంగా సత్కరించారు.  కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దేశ ప్రథమ పౌరురాలికి ఇదేనా మర్యాద.?
ప్రొటోకాల్‌ ప్రకారం స్వాగతించాల్సిన సీఎం ఎక్కడ.?
రాష్ట్రపతి పర్యటన ఉన్నా.. పట్టించుకోని చంద్రబాబు
దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశా ఖ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ పా టించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రా ష్ట్రానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు అధికారికంగా స్వాగతం పలకాల్సిన కనీస బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబా బు పూర్తిగా విస్మరించారు. దేశ ప్రథమ పౌరురాలి పర్య టన కంటే తనకు శాఖల సమీక్షలే ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు.. చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ప్రభుత్వ అతిథి గృహాలు, కన్వెన్షన్‌ హాల్స్‌ ఉన్నా.. ప్రైవేట్‌ హోటల్‌లో రాష్ట్రపతి బస ఏర్పాటు చేయడం.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహించడంపైనా విమర్శలొస్తున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement