రామచంద్రపురంలో దారుణం.. | Wife And Husband Incident In Ramachandrapuram Konaseema District | Sakshi
Sakshi News home page

రామచంద్రపురంలో దారుణం..

Aug 26 2026 9:24 PM | Updated on Oct 1 2026 11:39 AM

సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురంలో దారుణం జరిగింది. భర్తను  భార్య పొత్రం రాయితో కొట్టి హత్య చేసింది. భార్య తంగేటి ఉమాదేవి చేతిలో  భర్త తంగేటి ఎల్లారావు హత్యకు గురయ్యాడు. భార్యపై భర్త అనుమానం పెంచుకోవడంతో భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.

నిందితురాలు ఉమాదేవిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి భార్య మృతి చెందడంతో ఉమాదేవిని ఎల్లారావు రెండో వివాహం చేసుకున్నాడు. వృత్తి రీత్యా వంట పనులు చేసుకుని జీవించే ఎల్లారావుకు భార్యపై అనుమానం కలగడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 25న మద్యం సేవించి వచ్చి భార్యతో ఎల్లారావు ఘర్షణకు దిగాడు.

దీంతో భార్య పొత్రం రాయితో కొట్టడంతో భర్త మృతి చెందాడు. హతుడు సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు ఉమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారావు హత్యలో ఇతరుల ప్రమేయం ఉందా? అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement