మంత్రి బొత్స పీఏ ఇంట్లో చోరీ

Vizianagaram: Minister Botsa Satyanarayana PA House Burgled - Sakshi

విజయనగరం క్రైమ్‌: రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పీఏ కమలాకర్‌ ఇంట్లో గురువారం రాత్రి  చోరీ జరిగింది.  దీనికి సంబంధించి వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 
    

స్థానిక ఉడాకాలనీ ఫేజ్‌ –3, ఇంటినంబర్‌  177లో నివాసముంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ పర్సనల్‌ అసిస్టెంట్‌ కమలాకర్‌ వృత్తిరీత్యా విజయవాడ వెళ్లారు. ఆయన సతీమణి అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో కమలాకర్‌ కుమార్తె, అల్లుడు మాత్రమే ఉంటున్నారు. ఆయన కుమార్తె డాక్టర్‌ మౌనిక విశాఖ రైల్వేఆస్పత్రిలో వైద్యురాలిగా, అల్లుడు గజపతినగరంలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు.  

గురువారం కమలాకర్‌ కుమార్తె విశాఖ, అల్లుడు గజపతినగరం వృత్తిరీత్యా  వెళ్లారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఇల్లంతా చిందరవందరగా ఉండడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో క్లూస్‌ టీమ్, ఫింగర్‌ ఫ్రింట్స్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ టి.త్రినాథ్, సీసీఎస్, వన్‌టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. 

ఈ చోరీ సంఘటనలో లక్ష నగదు, రెండు తులాల బంగారం, సుమారు కిలో వెండి వస్తువులు పోయినట్లు గుర్తించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ సీఐ బి.వెంకటరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: జర్మనీ అమ్మాయి.. వైజాగ్‌ అబ్బాయి.. పెళ్లేమో అమెరికాలో)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top