విశాఖలో డాక్‌యార్డు ఉద్యోగాల పేరిట భారీ మోసం | Visakhapatnam Dockyard Jobs Scandal | Sakshi
Sakshi News home page

విశాఖలో డాక్‌యార్డు ఉద్యోగాల పేరిట భారీ మోసం

Dec 16 2024 4:13 PM | Updated on Dec 16 2024 5:24 PM

Visakhapatnam Dockyard Jobs Scandal

సాక్షి,విశాఖపట్నం: విశాఖలో నయా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల రూపాయలను ఏకంగా ఓ పోలీసే కాజేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

విశాఖ నావెల్ డాక్ యార్డ్‌లో ఉద్యోగాలు పేరుతో కంచరపాలెం పీఎస్‌ కానిస్టేబుల్‌ రమణమూర్తి, డాక్‌యార్డు ఉద్యోగి మోహన్‌బాబుతో కలిసి భారీ మోసానికి పాల్పడ్డాడు.⁠ఒక్కొక్క నిరుద్యోగి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. రమణమూర్తి,మోహన్‌బాబులపై బాధితులు ఫిర్యాదు చేశారు.సుమారు 20 మందికి ఉద్యోగాల ఆశచూపి రూ.80 లక్షల దాకా వసూలు చేసినట్లు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement