‘అమరావతి రైతులని చంద్రబాబే నట్టేట ముంచారు’ | Vellampalli Srinivas Takes On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘అమరావతి రైతులని చంద్రబాబే నట్టేట ముంచారు’

Mar 3 2022 12:35 PM | Updated on Mar 3 2022 1:39 PM

Vellampalli Srinivas Takes On Chandrababu Naidu - Sakshi

విజయవాడ: అమరావతి రైతులను చంద్రబాబు నాయుడే నట్టేట ముంచారని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. అమరావతిని భ్రమరావతిని చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. అమరావతిలో నాలుగు బిల్డింగ్‌లు కట్టి, రాజధానిగా చంద్రబాబు ప్రచారం చేశారని, గత టీడీపీ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాఫియాతో కుమ్మక్కై దోచుకుందన్నారు.

మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి.. ‘రియల్ ఎస్టేట్ మాఫియాకి సహకరించేలా గత ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించింది. సీఆర్‌డీఏ చట్టానికి కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ లో మళ్లీ సమస్యలు రాకుండా అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ది చేయాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు.

గతంలో అభివృద్ది ఒక్క హైదరాబాద్‌కే పరిమితమైంది.అన్ని జిల్లాలు.. అన్ని‌ప్రాంతాలని అభివృద్ది చేయాలనేది సీఎం వైఎస్ జగన్ ఆలోచన. రైతులకి అన్యాయం జరగనివ్వమని మొదట నుంచి మా ప్రభుత్వం చెబుతోంది. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. అమరావతిని అభివృద్ది చేయకుండా చంద్రబాబు కాలయాపన చేశారు’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement