భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు | Two Wivs Arrange Husbands third marriage with another woman | Sakshi
Sakshi News home page

భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు

Published Mon, Jul 1 2024 10:46 AM | Last Updated on Mon, Jul 1 2024 11:12 AM

Two Wivs Arrange Husbands third marriage with another woman

అల్లూరి సీతారామరాజు: భర్తకు ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేశారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి అక్షింతలు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో తొలి వివాహం జరిగింది. అయితే పిల్లలు పుట్టలేదని అతను అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2007లో ఓ బాబు పుట్టగా.. అలా వారి జీవనం సాగుతుండగా, తనకు రెండో సంతానం కావాలని పండన్న కోరడంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే..

జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధికి చెందిన లావ్యను తాను ఇష్టపడ్డ విషయం తన ఇద్దరు భార్యలకు చెప్పాడు పండన్న. ఈ క్రమంలో వారిద్దరే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి పెళ్లి గురించి దీంతో వారే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి మాట్లాడారు. పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో లావ్యను పండన్నకు ఇచ్చి వివాహం జరిపించారు.

తల్లిదండ్రులు లేని పండన్నకు ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. శుభలేఖల్లో కూడా వారి పేర్లే వేసి అందరినీ ఆహ్వాంచారు. గత నెల 25న జరిగిన మూడో పెళ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెళ్లి కార్డులు ప్రింట్ చేయించి, బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement