breaking news
husband marriage
-
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
అల్లూరి సీతారామరాజు: భర్తకు ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేశారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి అక్షింతలు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో తొలి వివాహం జరిగింది. అయితే పిల్లలు పుట్టలేదని అతను అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2007లో ఓ బాబు పుట్టగా.. అలా వారి జీవనం సాగుతుండగా, తనకు రెండో సంతానం కావాలని పండన్న కోరడంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే..జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధికి చెందిన లావ్యను తాను ఇష్టపడ్డ విషయం తన ఇద్దరు భార్యలకు చెప్పాడు పండన్న. ఈ క్రమంలో వారిద్దరే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి పెళ్లి గురించి దీంతో వారే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి మాట్లాడారు. పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో లావ్యను పండన్నకు ఇచ్చి వివాహం జరిపించారు.తల్లిదండ్రులు లేని పండన్నకు ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. శుభలేఖల్లో కూడా వారి పేర్లే వేసి అందరినీ ఆహ్వాంచారు. గత నెల 25న జరిగిన మూడో పెళ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెళ్లి కార్డులు ప్రింట్ చేయించి, బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న తెలిపాడు. -
‘నిజం చెప్పు.. నేనిప్పుడు గర్భవతిని కూడా..’
కాన్పూర్: మొత్తం ఓ ఐదు వందలమంది బంధువులు. మంగళవాయిద్యాలు. వినిపిస్తున్న బ్రాహ్మణుడి మంత్రాలు. పీటలపై నవ వధువు, వరుడి సంతోషం.. ఆసక్తిగా వేదిక ముందు కూర్చుని చూస్తున్న జనం. సరిగ్గా వధువు, వరుడు పూల దండ ఒకరికొకరు వేసుకొనే సందర్భంలోనే ఆగండి అంటూ గట్టి కేక.. కట్ చేస్తే వెనక్కి తిరిగి చూసిన వాళ్లకి తొలుత తుపాకీ.. ఆ తర్వాత ఆ తుపాకీని పట్టుకొని ఆవేశంగా దూసుకొస్తున్న ఓ మహిళ కనిపించింది. ‘ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు.. నేను అతడి ప్రియురాలిని.. అతడు నా ప్రియుడు.. ఇంతకుముందే మేం గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాం’ అంటూ టక్కున చెప్పేసింది. దీంతో అంతా బిత్తర పోయారు. పెళ్లి కొడుకు నీళ్లు నములుతూ అందరివైపు బిక్క మొహం పెట్టి చూశాడు. ఓ బాలీవుడ్ సినిమాను తలపించే రేంజ్లో ఉన్న ఈ సన్నివేశం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా షివ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. దేవేంద్ర అవస్తి అనే వ్యక్తి గతంలో ప్రస్తుతం తుపాకీతో వచ్చిన మహిళతో ప్రేమ వ్యవహారం నడిపాడు. వారిద్దరు వివాహం కూడా చేసుకున్నారు. అయితే, అది రహస్య వివాహం కావడంతో ఎవరికీ తెలియకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య వెంటనే తుపాకీతో కళ్యాణమంటపానికి వచ్చి అసలు విషయం చెప్పింది. అయితే, తొలుత వరుడు ఆ విషయాన్ని కొట్టి పారేయాలని చూడటంతో నేరుగా తుపాకీని తనకే గురిపెట్టుకొని నిజం చెప్పకుంటే కాల్చుకొని చనిపోతానంది. ఇప్పుడు తను గర్బవతిని కూడా అని చెప్పింది. దీంతో పెళ్లి ఆగిపోవడమే కాకుండా పెళ్లి కొడుక్కు ఇచ్చిన డబ్బులు, విలువైన వస్తువులు వారు తీసుకొని వెళ్లి పోయారు.