TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ | TTD News: Tirumala Que Updates On May 14 2024 | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ

May 14 2024 10:47 AM | Updated on May 14 2024 10:47 AM

TTD News: Tirumala Que Updates On May 14 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్‌మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 70,815 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement