విజయనగరం: కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం, రెండు రైళ్లు ఢీ, ఆరుగురు మృతి

Train Accident At Kantakapalle VizianagaramUpdates - Sakshi

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం

విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టిన పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 

పట్టాలు తప్పిన నాలుగు బోగీలు

ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు

Train accident Updates

►ఘటనా స్థలానికి చేరుకున్న యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ

►సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

►రాయగడ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు విడుదల చేశారు.

08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సంప్రదించవచ్చు.

►ఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ.

►ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాద స్థలికి విజయనగరం ఎస్పీ బయల్దేరారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

► రైలు ప్రమాదంలో ఒక బోగీలో చిన్నారులు ఇరుక్కుపోయారు. ఆర్తనాదాల మధ్య ప్రయాణికులు చీకటిలో చిక్కుకుపోయారు.  ఎలక్ట్రికల్‌ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రత్యేక రైలులో ఘటనా స్థలికి చేరుకున్నారు.

సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది.  కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలును పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్‌  ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్‌ చివరి నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో అరుగురు మృతిచెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కాగా ఓవర్‌ హెడ్‌ కేబుల్‌ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్‌ రైలును పలాస ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో సంఘటనా ప్రాంతం అంధకారంగా మారింది.  కరెంట్‌ లేకపోవడంతో  సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top