ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

Thasildar Ramanaiah Case: Main Culprit Arrested In Tamin Nadu - Sakshi

విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారాంను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్‌ తెలిపారు. నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. 

‘‘విశాఖ రూరల్ ఎమ్మర్వో రమణ  హత్య కేసులో నిందితుడి మురారి  సుబ్రహ్మణ్యం గంగారావుని అరెస్ట్ చేశాం. చెన్నై పోలీసుల సహకారం తో నిందితుడ్ని అరెస్ట్ చేయగలిగాం. హత్య అనంతరం నిందితుడు విమానంలో బెంగుళూర్ పరారయ్యాడు. అక్కడి నుంచి బస్‌లో చెంగల్పట్టు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. ఆపై నిందితుడిని విశాఖ తీసుకొచ్చాం. నిందితుడిపై విజయవాడ, హైదరాబాద్‌లో చీటింగ్‌ కేసులున్నాయ్‌. 

.. నిందితుడ్ని పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలు శ్రమించాయి. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తోంది. కంబైన్డ్ డీడ్ చేయడంలో  ఎమ్మార్వో జాప్యం చేయడంతోనే చంపినట్లు నిందితుడు చెబుతున్నాడు. అతన్ని పూర్తిగా విచారించాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని సీపీ తెలిపారు. 

ఇదిలా ఉంటే.. విశాఖలో ల్యాండ్ వివాదాలపై ఇక నుంచి ప్రతివారం విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సీపీ రవిశంకర్‌ తెలిపారు. ల్యాండ్ ధరలు పెరిగిన దశలో  సహజంగా వివాదాలు తలెత్తుతున్నాయని.. అందుకే కలెక్టర్ సహకారంతో ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటామని అన్నారాయన.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top