మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం! | Tenders are only for the ruling party | Sakshi
Sakshi News home page

మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం!

Jan 30 2025 5:16 AM | Updated on Jan 30 2025 5:16 AM

Tenders are only for the ruling party

నంద్యాల జిల్లాలో ‘పచ్చ’పాత టెండర్లు.. కస్తూర్బా, మోడల్‌ స్కూళ్లకు ప్రొవిజెన్స్‌ సరఫరా టెండర్లలో గోల్‌మాల్‌

అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే అందలం

నిబంధనలకు పాతరేసిన అధికార యంత్రాంగం

ఎల్‌1తో పాటు ఎల్‌4, ఎల్‌7లకూ టెండర్ల కేటాయింపు

సీల్డ్‌ కవర్‌ ఓపెన్‌ చేయకుండానే చికెన్‌ టెండర్‌ ప్రకటన

ఇలాగైతే టెండర్లు ఎందుకు పిలిచారని వ్యాపారుల ఆగ్రహం

సాక్షి, నంద్యాల: కస్తూర్బా బాలికల వసతి గృహాలు, మోడల్‌ పాఠశా­ల­లకు నిత్యావసర సరుకుల సరఫ­రాకు సంబంధించిన టెండర్లలో అధి­కా­రులు నిబంధనలకు తిలోదకాలి­చ్చారు. మా ప్రభుత్వం.. మా ఇష్టం.. అంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవ­డంతో వారు చెప్పిన వారికే టెండర్లు కట్టబెట్టారు. నంద్యాల జిల్లాలో 27 కస్తూర్బా బాలి­కల వసతి గృహాలు, 19 మోడల్‌ పాఠశాలల­(మొత్తం 46)కు కిరాణా సరుకులు (ప్రొవిజన్స్‌), కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్‌ సరఫరా చేయడం కోసం సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు గత డిసెంబర్‌ 21న టెండర్‌ నోటిఫికే­షన్‌ విడుదల చేశారు. 

ఏడాదికి ప్రొవిజ­న్స్‌కు రూ.6.43 కోట్లు, కూరగాయ­లకు రూ.1.75 కోట్లు, పండ్లకు రూ.96.49 లక్షలు, ఎగ్స్‌కు రూ.96.49 లక్షలు, చికెన్‌కు రూ.75.68 లక్షలుగా టెండర్‌లో పేర్కొ­న్నారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికి కాంట్రాక్ట్‌ ఇస్తామని నోటిఫికేషన్‌­లో తెలిపారు. టెండర్‌ వేయొద్దని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగి­నప్పటికీ తుదకు ఇద్దరు టీడీపీ నేతలు సహా తొమ్మిది మంది టెండర్‌లో పాల్గొని.. ఒక కేజీబీవీ వసతి గృహం, ఒక మోడల్‌ స్కూల్‌కు కలిపి (నెలకు) కోట్‌ చేశారు. 

గత నెల 31న టెండర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత రూ.2,71,731 ధరను కోట్‌ చేసి శ్రీ శ్రీనివాస ట్రేడర్స్‌ ఎల్‌1గా నిలిచింది. అయితే తమ వారికి ఈ కాంట్రాక్టు రాకపోవడంతో జిల్లాకు చెందిన మంత్రులు రంగంలోకి దిగి అధి­కారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎల్‌1గా నిలిచిన శ్రీ శ్రీనివాస ట్రేడర్స్‌కు 16, ఎల్‌4 శ్రీసాయి ఎంటర్‌ ప్రైజెస్‌కు 15, ఎల్‌7 కేవీఆర్‌ ఆగ్రోస్‌కు 15 పాఠశాలల చొప్పున విభజించి కాంట్రాక్టు కేటా­యించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించడం కల­క­లం రేపింది. 

జిల్లా పర్చేజింగ్‌ కమిటీ చైర్మన్‌ అయిన జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి, టెండర్‌ ప్రక్రియనే మార్చేశారని టెండర్‌లో పాల్గొన్న వారు ఆరోపిస్తు­న్నారు. చికెన్‌ టెండర్‌ను ఓపెన్‌ చేయ­కుండానే కేవీఆర్‌ ఆగ్రోస్‌­కు కట్టబె­ట్టారని, అసలు ఆ సంస్థకు అర్హతే లేదని చెబు­తు­­న్నారు. ఇలా ఏకపక్షంగా కేటా­యి­ంచాలనుకున్న­ప్పుడు ఎందుకు టెండర్లు పిలిచా­రని ప్రశ్ని­స్తున్నారు. 

కాగా, శ్రీ శ్రీని­వాస ట్రేడర్స్‌ మాత్రమే సరు­కుల సరఫరా ప్రారంభించగా, మిగతా రెండు సంస్థలు ఇంకా మొదలు పెట్టలేదు. టెండర్ల­లో అవకతవకల విషయమై జేసీ విష్ణు చరణ్‌ను సంప్రదించగా.. ఎల్‌1 కోట్‌ చేసిన మొ­త్తా­­నికే తాము కూడా ప్రొవిజన్స్‌ సరఫరా చేస్తా­మ­ని ఎల్‌4, ఎల్‌7లు ముందుకు రావ­డంతో అందరికీ కలిపి కాంట్రాక్ట్‌ ఇచ్చా­మన్నారు. చికెన్‌ టెండర్‌లో మిగతా వారంతా రింగ్‌ అయి­నట్లు తెలియ­డంతో అలా చేశామన్నా­రు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement