చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్‌ | TDP Leaders Voice Calls to Ap people with the name of CM Jagan | Sakshi
Sakshi News home page

చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్‌

Apr 29 2024 2:33 AM | Updated on Apr 29 2024 2:33 AM

TDP Leaders Voice Calls to Ap people with the name of CM Jagan

ఓటమి తప్పదని దూషణల పర్వం

సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తూ వాయిస్‌ కాల్స్‌  

అన్‌నోన్‌ కాల్స్‌తో బెంబేలెత్తుతున్న ప్రజలు 

షార్ట్‌ఫిలిమ్స్‌తో సీఎం, వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం

ఈ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ విజయం  ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ బెంబేలెత్తుతోంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు మార్గాలు ఎంచుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ పచ్చ సోషల్‌ మీడియా రెచ్చిపోతోంది. స్పామ్‌ కాల్స్‌ పేరుతో జనాలకు ఫోన్‌లు చేసి విసిగిస్తోంది. ఫోన్‌ ఎత్తితే చాలు.. సీఎం జగన్‌పై అసభ్య పదజాలంతో దూషణలు వినిపిస్తోంది. నోటికి వచ్చిన మాటలతో తిట్ల దండకం అందుకుంటోంది. అబద్ధాలను ప్రచారం చేస్తూ బురద జల్లుతోంది. 

ఎవరో ఫోన్‌ చేస్తున్నారనుకుని ఆ ఫోన్‌ ఎత్తితే చాలు.. ఆ వాయిస్‌ కాల్‌లో సీఎం జగన్‌ను బండ బూతులు తిడుతున్నారు. పదే పదే కాల్స్‌ చేసి జనాలను సతాయిస్తున్నారు. ఈ క్రమంలో జనాలు అలాంటి స్పామ్‌ కాల్స్‌ను ఎత్తకపోవడంతో చివరికి ఎంతకు తెగించారంటే.. ఆ కాల్స్‌పై ట్రూకాలర్‌లో యువర్‌ జగన్, జగన్‌ లీడర్, మాస్‌ లీడర్‌ జగన్‌.. అంటూ పేర్లు వచ్చేలా చేసి.. జగన్‌ను అభిమానించే వారు ఫోన్‌లు తీసేలా చేస్తున్నారు. మరోవైపు షార్ట్‌ఫిలిమ్స్‌తో సీఎం జగన్, వైఎస్సార్‌సీపీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు.

జగన్‌పై దు్రష్పచారం చేయడం, టీడీపీకి ఓటు వేయాలని కోరుతుండటంతో వాటిని టచ్‌ చేయాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఎలాగైనా వైఎస్సార్‌సీపీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి.. దు్రష్పచారం చేస్తున్నాయి. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే మీడియా సర్టీఫికేషన్‌ ఆఫ్‌ మానిటరింగ్‌ కమిటీలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement