ఆటోమ్యుటేషన్ పేరిట ప్రజలపై భారం మోపడానికి బాబు సర్కారు సిద్ధం
సాక్షి,అమరావతి: ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అమలు చేయని చంద్రబాబు సర్కారు ప్రజలపై భారాలు మోపడానికి పోటీపడుతోంది. ఆధునికత, ఏకీకృత విధానాల పేరిట వివి ధ రూపాల్లో బాదేస్తోంది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో ప్రజ లపై భారాలు మోపడానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంది. ఆటోమ్యుటేషన్‌కు, డిజిటలైజేషన్, రాష్ట్రవ్యాప్తంగా ఒకే పాల సీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల (మూడో సవ రణ) బిల్లు 2026ను ప్రవేశపెట్టింది. పురపాలక కార్పొరేషన్ల చట్టం–1955లోని సెక్షన్ 208, ఏపీ పురపాలక చట్టం–1965 లోని సెక్షన్ 93 సవరణకు సిద్ధపడింది.
ప్రజల కష్టాలను, ఆర్థి క ఇబ్బందులను విస్మరించింది. ఆస్తి అమ్ముకోవాలన్నా.. గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వాలన్నా అప్పటివరకూ ఉన్న బకాయిలు చెల్లి స్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని పేర్కొంది. స్థానిక సంస్థలు నిర్ణయించాల్సిన ఫీజును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించేలా అధికారం తీసుకుని స్థానిక సంస్థల అధి కారాలకు కత్తెర వేస్తోంది. బిల్లులో ప్రభుత్వం చూపిన కారణాలు చూసి నిపు ణులు విస్తుపోతున్నారు. ఒకే పాలసీ పేరుతో సామాన్యుల ఇబ్బందులను విస్మరించి.. ఆదాయం దండుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
లోపాలను పట్టించుకోని సర్కారు
ఆదాయం రాబట్టు కోవడానికి చట్టాల్లోని పలు సెక్షన్లను సవ రించడానికి సిద్ధపడిన చంద్రబాబు సర్కారు దానిలో లోపా లు, ప్రజల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను విస్మరించింది. కొత్త గా ప్రవేశ పెట్టిన బిల్లులో మ్యుటేషన్ ఫీజు ఎంత శాతం, ఎంత మొత్తం ఉంటుందో నిర్దిష్టంగా పేర్కొనలేదు.
ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం
ఆస్తి అమ్మకం, బహుమతి, తనఖా, విభజన, మార్పిడి లేదా వారసత్వ బదిలీ అవ్వాలన్నా ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించాలి. మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ అనంతరం పురపాలక రికార్డుల్లో కొత్త యజమాని పేరు ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. అసెస్‌మెంట్ లేని ఆస్తులు కూడా పురపాలక పన్ను పరిధిలోకి వస్తాయి.
బిల్లులో ప్రధాన లోపాలు
మ్యుటేషన్ ఫీజు ఎంతో చెప్పలేదు. బిల్లులో ఫీజు మొత్తం, శాతం, కనిష్ట–గరిష్టపరిమితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందని మాత్రమే పేర్కొంది. పట్టణ స్థానిక సంస్థల కేటగిరీల వారీగా శాతం ఆధారిత రేట్లు నిర్ణయిస్తామని చెప్పి న సర్కారు అసలు సవరణ క్లాజుల్లో శాతం, కేటగిరీలు, రేటు నిర్ణయించే ప్రమాణాలను పొందు పరచలేదు.
రిజిస్ట్రేషన్‌కు బకాయిల లింక్ !
సామాన్యుడు ఏదైనా అవసరం ఉండి ఆస్తి అమ్ము కోవాలన్నా బిల్లులో పొందుపరిచిన నిబంధనలు గుదిబండగా ఉన్నాయి. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడంతో పాటు మ్యుటేషన్ ఫీజు కట్టిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. దీనివల్ల చిన్న బకాయి ఉన్నా.. రికార్డుల్లో పొరపాటు ఉన్నా రిజిస్ట్రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
వివాదాస్పద పన్ను బకాయిలపై స్పష్టత ఏది?
ఆస్తి పన్ను నిర్ణయాన్ని యజమాని కోర్టులో లేదా అప్పీల్‌లో సవాలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్‌కు అను మతిస్తారా?లేదా అన్నది చెప్పలేదు. మరో వైపు‘సందర్భానుసారంగా బదిలీ దారుడు, బదిలీ పొందేవారు బకాయిలు చెల్లించాలి’అని పేర్కొన్నా.. ఎవరు ఏ బకాయి చెల్లించాలనేది స్పషత లేదు.
తనఖాకు ఆటోమ్యుటేషన్ ఎందుకు?
ఆస్తిని తనఖా పెట్టినంత మాత్రాన యాజమాన్యం మారదు. అయినప్పటికీ తనఖా లావాదేవీని కూడా మ్యుటేషన్ ప్రక్రి యలో చేర్చింది. దీని వల్ల ఆర్థిక అవసరాల కోసం బ్యాంకు రుణాలు తీసుకునేవారిపై అదనపు భారం పడుతుంది.
కుటుంబ బదిలీ అయినా వడ్డనే
వారసత్వం, కుటుంబ విభజన, బహుమతి, భార్యా భర్తలు లేదా తల్లిదండ్రులు – పిల్లల మధ్య బదిలీలకు ప్రత్యేక రాయితీలు గాని మినహాయింపు ఇవ్వలేదు. మరో వైపు పేదల, మధ్యతరగతి ప్రజలు, చిన్న ఇళ్లు, తక్కువ విలువైన ఆస్తులు, ప్రభుత్వ గృహ పథకాల లబ్ధిదారులు, పేద కుటుంబాలకు మ్యుటేషన్ ఫీజు మినహాయిస్తారా లేదా అన్న అంశంపై అసలు బిల్లులో ప్రస్తావించలేదు. దీనివల్ల పేదలు, మధ్య తరగతి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు.
ఫీజు ఏ విలువపై లెక్కిస్తారో!
మ్యుటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ విలువపైనా, మార్కెట్ విలువపైనా, ఆస్తి పన్ను వార్షిక విలువపైన నిర్ణ యిస్తారో పేర్కొనలేదు. మరో వైపు ఒకే లావాదేవీపై చార్జీల మోతమోగనుంది. స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లిస్తున్న ఇప్పుడు అదనంగా ముటేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి వస్తుంది.
అసెస్‌మెంట్ లేని ఆస్తులపై స్పష్టత ఏది?
తాత్కాలిక అసెస్‌మెంట్ నంబర్ ఇస్తామని చెప్పారు. తుది అసెస్‌మెంట్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, అభ్యంతరాలు ఎలా స్వీకరిస్తారు, అప్పీల్ ఎక్కడ చేయాలి అనే వివరాలు లేవు. మరో వైపు ఆటో మ్యుటేషన్‌లో తప్పుల సవరణకు వ్యవస్థ లేదు. పేరు, విస్తీర్ణం, డోర్ నంబర్, యాజమాన్య వివరాలు తప్పుగా నమోదైతే వాటిని సరిచేసే గడువు, ఎవరు పరిష్కరిస్తారో పేర్కొనలేదు.
అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగితే?
నకిలీ పత్రాలు లేదా కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులకు ఆటో మ్యుటేషన్ జరిగితే రద్దు లేదా సవరణకు అనుసరించాల్సిన విధానం లేదు. మ్యుటేషన్‌కు ముందు సహ యజమానులు, వారసులు లేదా ఇతర హక్కుదారులకు నోటీసు ఇవ్వాలా? అభ్యంతరాలు స్వీకరించాలా? అనే అంశంపై స్పష్టత ఇవ్వ లేదు. రిజిస్ట్రేషన్, ఆస్తి పన్ను డేటాను అనుసంధాని స్తున్నప్పటికీ వ్యక్తిగత సమాచారం భద్రత, సైబర్ సెక్యూరిటీ, డేటా దుర్వినియోగం కాకుండా ఎలాంటి రక్షణ వ్యవస్థ తీసుకొస్తోందో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.
బకాయిలు చెల్లిస్తేనే...
⇒ ఆస్తికి సంబంధించిన బదిలీ నోటీసు ఇచ్చే తేదీ నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలి.
⇒ ప్రభుత్వం నిర్ణయించే ఆటోమ్యుటేషన్ ఫీజును చెల్లించకపోతే ఆస్తి బదిలీ జరగదు.
⇒ ఆన్‌లైన్ ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ రిజిస్టర్‌లో ఇప్పటికే నమోదైన ఆస్తుల బదిలీ సమయంలో మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి.
⇒ ఆస్తిని పొందుతున్న వ్యక్తి అన్ని పురపాలక బకాయిలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారు.
⇒ ఇప్పటి వరకు అసెస్‌మెంట్ చేయని ఆస్తి రిజిస్ట్రే షన్‌కు వస్తే ముందుగా తాత్కాలిక అసెస్‌మెంట్ నంబర్ జారీ చేస్తారు. నిబంధనల్లో నిర్దేశించిన ప్రక్రియ పూర్తయ్యాక ఆ ఆస్తికి శాశ్వత అసెస్ మెంట్ నంబర్ కేటాయిస్తారు.
⇒ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖతో పురపాలక శాఖ వ్యవస్థలను అనుసంధానించి రిజిస్ట్రేషన్ పూర్తికాగానే ఆటో మ్యుటేషన్ అవుతుంది.


