నువ్వు బలిజవి.. కమ్మోళ్లకే ఉద్యోగం | TDP Leaders Revenge On Field Assistant In Chittoor District | Sakshi
Sakshi News home page

నువ్వు బలిజవి.. కమ్మోళ్లకే ఉద్యోగం

Jun 10 2025 7:55 AM | Updated on Jun 10 2025 1:48 PM

TDP Leaders Revenge On Field Assistant In Chittoor District
  • చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై టీడీపీ నేతల కక్ష 
  • జనసేన పార్టీ బ్యానర్‌లో ఆయన భార్య ఫోటో వేయడమే కారణం
  • ఉద్యోగం నుంచి తొలగింపునకు తప్పుడు ఆరోపణలతో నివేదికలు
  • నా చావుకు కారణం ఎంపీడీవోనే అంటూ విషంతో ట్యాంక్‌ ఎక్కిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌

శ్రీరంగరాజపురం: కూటమి నేతలు చిరుద్యోగులపైనా కక్ష సాధిస్తున్నారు. దీంతో సోమవారం చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేష్‌ విషం సీసాతో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ‘‘నా చావుకు ఎంపీడీవోనే కారణం’’ అని ఆరోపించాడు. వివరాలు అతడి మాటల్లోనే.. ‘‘నేను శ్రీరంగరాజు మండలం ఎగువ కమ్మకండ్రిగ పంచాయతీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా 2016 నుంచి పనిచేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచి్చన రోజు నుంచి నన్ను వేధిస్తున్నారు. 

జనసేన పార్టీ బ్యానర్‌లో నా భార్య సుబ్బలక్ష్మి ఫొటో వేయడంతో లేనిపోని ఆరోపణలతో నన్ను ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా తొలగించేలా చేశారు. నేను బలిజ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఉద్యోగ భద్రత కలి్పంచాలని అడిగితే కులం పేరుతో అవమానించారు. కమ్మ కులస్తులకే ఉద్యోగం ఉస్తామని చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించా. నాకు అనుకులంగా తీర్పు వచ్చింది.  ఎంపీడీఓ నాపై తప్పుడు నివేదికలు సమరి్పంచారు. నాకు ఉద్యోగ భద్రత కలి్పంచకుంటే ఆత్మహత్య చేసుకుంటా’’ అంటూ ట్యాంక్‌ ఎక్కాడు. 

పోలీసులు, తహసీల్దార్, ఎంపీడీవో ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగ భద్రత కలి్పస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగొచ్చాడు. కాగా, తన భర్తకు ఏమైనా జరిగితే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని వెంకటేష్‌ భార్య సుబ్బలక్ష్మి హెచ్చరించారు. చిన్న ఉద్యోగమే తమ కుటుంబానికి ఆధారమని,  కొన్నాళ్లుగా టీడీపీ నాయకులు, అధికారుల వేధింపులు తీవ్రంగా ఉన్నాయని తెలిపింది. ‘‘మేం ఏం పాపం చేశాం..? ఎందుకు మాపై ఇంత కక్ష?’’ అంటూ కన్నీరు పెట్టుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement