టీడీపీ, జనసేన బాహాబాహి | TDP and Janasena Leaders Clash in Kurnool district | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన బాహాబాహి

Jan 31 2025 4:41 AM | Updated on Jan 31 2025 1:29 PM

TDP and Janasena Leaders Clash in Kurnool district

డీలర్‌షిప్‌ విషయంలో ఆదోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తోపులాట  

ఆదోని రూరల్‌: కర్నూలు జిల్లా ఆదోని నియోజక­వర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. తాజాగా గురువారం రాత్రి ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. నియోజకవర్గంలోని డీలర్‌షిప్‌ల వాటాల విషయంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు సబ్‌­కలెక్టర్‌ కార్యాలయం వద్ద గుమిగూడారు.

నియో­జకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నిర్వ­హిస్తున్న నిత్యావసర సరుకుల దుకాణాల డీలర్‌­షిప్‌లను తొలగించి తమకు ఇవ్వాలని, ఈ విష­యంపై తమ అధినేతలు జిల్లా కలెక్టర్, ఆ శాఖ మంత్రిని ఆదేశించారంటూ బాహాటంగానే చెప్పుకు­న్నారు. ఈ క్రమంలోనే పలానా డీలర్‌షిప్‌ తమకు కావాలంటే తమకు కావాలని రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆదోని టూటౌన్‌ పోలీ­సులు అక్కడకు వచ్చి రెండువర్గాలకు సర్ధిచెప్పి శాంతింపచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement