రాష్ట్ర ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా? | TDP Activists Incident on YSRCP Candidates: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా?

Oct 24 2026 5:28 AM | Updated on Oct 24 2026 1:15 PM

అవే దాడులు... అదే హింస... దునుమాడుతున్న ‘దేశం’ గూండాలు... వారికి అండగా లాఠీలతో దండెత్తుతున్న ఖాకీలు..! రెడ్‌బుక్‌ను ఆచరిస్తూ.. రాష్ట్రమంతా రక్తచరిత్రను రాస్తూ... యధేచ్ఛగా రాజ్యాంగ స్వేచ్ఛను హరిస్తూ.. పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్న టీడీపీ గూండాల ఆగడాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా...? ఎక్కడ చూసినా నామినేషన్‌ అంటే.. ఎలిమినేషన్‌ అన్నట్లుగా తెగబడి దాడులు చేస్తున్నారు.. మహిళలు.. గర్భిణులు అనే కనికరం కూడా లేకుండా రక్తం కళ్ల చూస్తున్నారు. అయినా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని ఎలా చెబుతారు? చివరికి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం తప్పుదారి పట్టిస్తారా?.. అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఇటీవల పత్రికల్లో ప్రచురితమైన ఫొటోలను పోస్టు చేస్తూ ఏపీలో జరుగుతున్న అరాచకాలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు.   

పులివెందులలో నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తుపాకీ ఎక్కుపెట్టిన డీఎస్పీ మురళీనాయక్‌  

రాజంపేట నామినేషన్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి సంబందీకులను కట్టెలతో చితకబాదుతున్న టీడీపీ మూకలు  

కడపలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చించేసిన పచ్చమూకలు  

మార్కాపురం జిల్లా పీసీపల్లిలో నామినేషన్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరలక్ష్మిపై దాడి చేసి ఈడ్చేస్తున్న టీడీపీ గూండాలు 

పల్నాడు జిల్లా రొంపిచర్లలో టీడీపీ గూండాల దాడిలో రక్తమోడుతున్న వైఎస్సార్‌సీపీ నేత 

పులివెందులలో టీడీపీ మూకలు నిప్పు పెట్టడంతో తగలబడుతున్న వైఎస్సార్‌సీపీ నేత నిరంజన్‌రెడ్డి లారీ  

అనంతపురం రూరల్‌ ఎంపీడీవో కార్యాలయం వద వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులను పోలీసుల ఎదుటే అడ్డుకుని చీరలు లాగుతున్న టీడీపీ మూకలు   

అనంతపురం రూరల్‌ ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన రాముడు  

చిత్తూరులో పెనుమూరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని నిరీషారెడ్డి నుంచి నామినేషన్‌ పత్రాలు లాక్కుంటున్న టీడీపీ గూండాలు 

రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నిరీషారెడ్డి ఇచ్చిన నామినేషన్‌ పత్రాలను లాక్కుని చింపివేస్తున్న టీడీపీ మహిళా నేత 

 టీడీపీ గూండాల నుంచి తప్పించుకుని రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలు అందించేందుకు పరుగు తీస్తున్న నిరీషారెడ్డి 

ప్రకాశం జిల్లా పొన్నలూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను చించివేసి గాలిలోకి విసిరిన టీడీపీ అల్లరిమూక 

అన్నమయ్య జిల్లా పెద్దకొండామర్రిలో టీడీపీ రౌడీల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గణేష్‌  

వైఎస్సార్‌ కడప జిల్లా నందలూరు హైవేపై తుపాకీతో కాల్పులు జరుపుతున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం   

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి కారుపై కర్రలు, కత్తులతో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు  

కడపలో  కత్తి పోటుకు గురై రక్తమోడుతున్న మాజీ కార్పొరేటర్‌ కుమారుడు మురాద్‌  

రక్తంతో తడిసిన చొక్కాతో ఎంపీ మిథున్‌రెడ్డి నాలుగు గంటల పాటు నిల్చున్నా నామినేషన్‌ తీసుకోని ఆర్వో 

ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నళినిపై­ దుర్మార్గంగా దాడి  

చిలకలూరిపేటలో ఆర్వో, పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు 

చిలకలూరిపేటలో ఆర్వో, పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement