జూడాల సమ్మె తీవ్రం | Strike of JUDAs is intensed, Emergency services closed in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మె తీవ్రం

Aug 17 2026 5:40 AM | Updated on Aug 17 2026 5:40 AM

Strike of JUDAs is intensed, Emergency services closed in Andhra Pradesh

నేటి నుంచి అత్యవసర సేవలు బంద్‌

స్టైపెండ్‌ల పెంపుపై ఆగస్టు 15 వరకూ ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ 

ప్రభుత్వం నుంచి స్పందన నిల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్‌ వైద్యుల (జూడా) సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. సోమ­వారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించనున్నామని ఏపీ జూడా అసోసియేషన్‌ ఆదివారం ప్రకటించింది. స్టైపెండ్‌ల పెంపులో చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెలోకి వెళ్లిన విష­యం తెలిసిందే. దశల వారీ సమ్మెలో భాగంగా స్టైపెండ్‌ పెంపు నిర్ణయంపై ఆగస్టు 15 వరకూ ప్రభుత్వానికి ఏపీ జూడా డెడ్‌లైన్‌ ఇచ్చింది. గడువులోగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేక­పో­వడంతో అత్యవసర సేవలను బహిష్కరించి సమ్మె తీవ్రతరం చేస్తున్నామని జూడా రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌ శంకర్‌ ప్రకటించారు. సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఇంటర్న్స్, జూనియర్‌ రెసిడెంట్స్, పీజీలు, సీనియర్‌ రెసిడెంట్స్‌ అత్యవసర సేవల్ని బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటారు. 

వీరి సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం(ఏపీజీడీఏ), ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏఏపీ), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ఏపీ విభాగం, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించా­యి. ఈనెల 10 నుంచి జూడాలు సమ్మె ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి వీరికిచ్చే స్టైపె­ండ్‌ను పెంచాల్సి ఉంది. దీని గురించి గతే­డాది డిసెంబర్‌ నుంచే ఏపీ జూడా ప్రభుత్వానికి విన­తులు ఇస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత నెలలో సమ్మె నోటీస్‌ ఇచ్చా­రు. ఈ క్రమంలో చర్చలకు పిలిచిన ప్రభు­త్వం జూడా­లు 30%పెంపు కోరగా కేవలం 3 శాతం పెంచుతామని చెప్పింది. కొన్నేళ్లుగా ఆనవా­యితీగా వస్తున్న 15% పెంపును కూడా ప్రభు­త్వం ఎత్తేయడంపై నిరసనగా జూడాలు సమ్మెలోకి వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement