జగనన్న తెచ్చిన అనుమతుల వల్లే స్టీల్‌ప్లాంటు సాకారం | The steel plant was realized only because of the permissions brought by Jagan | Sakshi
Sakshi News home page

జగనన్న తెచ్చిన అనుమతుల వల్లే స్టీల్‌ప్లాంటు సాకారం

Jul 5 2026 5:30 AM | Updated on Jul 5 2026 5:30 AM

The steel plant was realized only because of the permissions brought by Jagan

వైఎస్‌ జగన్‌ను దూషించడానికే సభ పెట్టారు 

చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడబోయి బొక్కబోర్లా పడ్డారు 

బాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు 

కడప ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ అవినాష్ రెడ్డి ధ్వజం 

కడప కార్పొరేషన్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన అనుమతుల వల్లే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంటు సాకారమవుతోందని కడప ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ అవినాష్ రెడ్డి చెప్పారు. ఆయన శనివారం కడపలో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు కర్మాగారానికి 2023 ఫిబ్రవరిలో వైఎస్‌ జగన్, సజ్జన్‌ జిందాల్‌ శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు మళ్లీ అదే ప్రాజెక్టుకు శుక్రవారం శంకుస్థాపన చేసి జిందాల్‌ సంస్థను ఆయనే సంప్రదించి తెచ్చినట్లు క్రెడిట్‌ చోరీకి దిగి బొక్కబోర్లా పడ్డారని అన్నారు. 

వైఎస్‌ జగన్‌ తెచ్చిన అనుమతుల వల్ల ఈ ప్రాజెక్టు సాకారమైందని శుక్రవారమే సజ్జన్‌ జిందాల్‌ చేసిన రీ ట్వీట్‌తో చంద్రబాబు గాలి మొత్తం పోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా బలమైన ప్రైవేటు యాజమాన్యం స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావించి టాటా, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపారని గుర్తు చేశారు. జేఎస్‌డబ్ల్యూను ఒప్పించి 2022 డిసెంబర్‌ 21న 1,100 ఎకరాలతో పాటు అనేక రాయితీలు ఇచ్చారన్నారు. 

అన్ని అనుమతులు తెప్పించి, గండికోట నుంచి స్టీల్‌ప్లాంటుకు 2 టీఎంసీల నీటిని కేటాయించారని, ఎన్‌హెచ్‌–67 నుంచి 12 కిలోమీటర్ల రోడ్డుకు రూ.50 కోట్లు మంజూరు చేసి రూ.30 కోట్లు ఖర్చు చేశారన్నారు. పెద్ద దండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల రైతులకు పరిహారం చెల్లించారని, పట్టాలు లేనివారు, డీకేటీ భూముల రైతులకు కూడా 50 శాతం పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. ఇవన్నీ వైఎస్‌ జగన్‌ చేశారు కాబట్టే సజ్జన్‌ జిందాల్‌ ధన్యవాదాలు తెలిపారన్నారు. చంద్రబాబు కేవలం వైఎస్‌ జగన్‌ను దూషించడానికే సున్నపురాళ్లపల్లెలో సభ పెట్టారని చెప్పారు.

చంద్రబాబు, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎన్ని అవాస్తవాలు చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు. రాజధాని అమరావతికి రూ. 2 లక్షల కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడమేమిటని ప్రశి్నంచారు. వైఎస్‌ జగన్‌  మంచి ఆలోచనతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి రాజధాని చేయాలని ప్రతిపాదన చేశారన్నారు. అమరావతి ప్రజా రాజధాని కాదని, ఒక వర్గం ధనికుల రాజధాని అన్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు అన్నీ 
మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement