కడప సెవెన్‌రోడ్స్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాలో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు వివరించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సంబంధిత పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖల కమిషనర్లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కడప కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. జిల్లాలోని 39 మండలాల పరిధిలో 619 గ్రామపంచాయతీలు, 6,004 వార్డులు ఉన్నాయని, మొత్తం 11,84,815 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికలు నిర్వహించని 8 గ్రామపంచాయతీలకు సంబంధించి న్యాయస్థానాల ఉత్తర్వులు, ఎన్నికల బహిష్కరణ తది తర అంశాలను కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
దాల్మియా పరిశ్రమ ప్రభావిత గ్రామాల ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిబంధనల మేరకు అమలు చేసి, వారికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను, దాల్మియా సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాతో కలిసి దాల్మియా సంస్థ యాజమాన్య ప్రతినిధులు, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత ఏడాది నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని అంశాల వారీగా సమీక్షించారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


