వివిధ వివాహ వేదికల డేటా ప్రకారం.. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారిలో 90 శాతానికి పైగా అబ్బాయిల ప్రొఫైల్స్ ఉంటుండగా, అమ్మాయిల వివరాలు మాత్రం పది శాతం కూడా దాటడం లేదు. గతంలో అమ్మాయిల తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు అబ్బాయిల తండ్రులు రోజుకు రెండు మూడు సార్లు ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారు. ‘మాకు ఆస్తిపాస్తులతో పనిలేదు, అమ్మాయి నచ్చితే చాలు.. ఏదైనా కొత్త ప్రొఫైల్ వస్తే మొదట మాకే చెప్పండి, ఫీజు ఎంతైనా ఇస్తాం’ అంటూ అబ్బాయిల తల్లిదండ్రులు బ్యూరోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


