32 మంది పోలీసులను బదిలీ చేసిన కర్నూలు ఎస్పీ | SP Sudheer Kumar Reddy Transferred 32 Policemen Kurnool District | Sakshi
Sakshi News home page

32 మంది పోలీసులను బదిలీ చేసిన కర్నూలు ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి

Aug 9 2021 9:18 PM | Updated on Aug 9 2021 9:20 PM

SP Sudheer Kumar Reddy Transferred 32 Policemen Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: పోలీసుశాఖలో అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన 32 మందిపై బదిలీ వేటు పడింది. కర్నూలు ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి 32 మంది పోలీసులను బదిలీ చేశారు. ముగ్గురు ఏఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు..17 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ బదిలీ చేశారు. వారు పనిచేస్తున్న స్థానాల నుంచి తప్పించి మరో ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మట్కా, గుట్కా, అక్రమ మద్యం వ్యవహారాల్లో ఆరోపణలు నేపథ్యంలో బదిలీ చేసినట్లుఓ తెలుస్తోంది. ప్రస్తుతం బదిలీ వేటు పోలీసుల శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement