
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశంతో తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం ఇలాంటి విపత్తుల సమయంలో బాధితులకు సహాయాన్ని మరిచి పబ్లిసిటీ కోసం పాకులాడేది. పబ్లిసిటీ కోసం గత ప్రభుత్వం.. ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..)