కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కృష్ణమూర్తి కన్నుమూత

Sahitya Academi awardeeTelugu writer C Krishnamurthy passed away - Sakshi

దాచేపల్లి (గురజాల): కేంద్ర సాహిత్య అకాడ మీ అవార్డు గ్రహీత చిట్టిప్రోలు కృష్ణమూర్తి (85) గురువారం కన్ను మూశారు. కొంతకా లంగా అనారో గ్యంతో బాధపడుతూ హైదరా బాద్‌ లో కుమారుడి వద్ద ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన కు భార్య సరస్వతి, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు గతంలోనే మరణించారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో చిట్టిప్రోలు వెంకట రత్నం, కనకమ్మ దంపతులకు 1936 డిసెంబర్‌ 26న జన్మించిన కృష్ణమూర్తి స్వగ్రామంలో సుదీర్ఘ కాలం పోస్ట్‌ మాస్టర్‌గా పనిచేశారు. పద్యాలు, కవి తలపై ఆసక్తి మెండు. ఆయన కలం నుంచి కైకేయి, తరంగణి, అక్షర దేవాలయం, పురుషో త్తముడు..  వంటివి జాలువారాయి. మహిషా సుర శతకము, మాఘ మేఘములు అనే సంస్కృత కావ్యాలను అదేపేరుతో తెలుగులోకి అనువదించారు.  ఆయన రచించిన ‘పురుషోత్త ముడు’ కావ్యానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top