పంట నష్టం: రూ. 113.11 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

RS 113 Crores Input Subsidy Released For Crop Damage In Ap Due To Rains - Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ ప్రభుత్వం రూ. 113.11 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సోమవారం విడుదల చేసింది. జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు చేయనుంది. గోదావరి, కృష్ణా, కుందూ నదుల వరదల ప్రభావంతో 33 శాతానికంటే ఎక్కువగా దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందనుంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. చదవండి: తిరుమల అన్న ప్రసాద కేంద్రంలో ఆయుధ పూజ

విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం,  నెల్లూరు, కర్నూలు, కడప, అనంత జిల్లాల్లోని రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేయగా.. నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ సబ్సిడీ చెల్లింపులు జరపాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. అదే విధంగా వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన పంటలకు రూ. 22.59 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేశారు. మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు చేయనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి చెల్లించాలని మంత్రి‌ తెలిపారు. చదవండి: గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top