కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి | Road accident in Andhra Pradesh's Kurnool district | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Nov 2 2024 11:40 AM | Updated on Nov 2 2024 1:11 PM

Road accident in Andhra Pradesh's Kurnool district

సాక్షి,కర్నూలుజిల్లా: కర్నూలు జిల్లాలోని నందవరం మండలం ధర్మపురం గ్రామం వద్ద ఎన్‌హెచ్‌-167పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(నవంబర్‌ 2) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంతో వెళుతున్న కారు ఆటోను ఢీకొట్టింది.

ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీర నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరిని కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా  మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఇద్దరికి గాయలవగా గాయపడినవారిలో చాన్నిరి రిజియా పరిస్థితి విషమంగా ఉంది. 

ఇదీ చదవండి: కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు 
 

Advertisement
 
Advertisement
Advertisement