RK Beach Life Guards Saved The Life Of Deepak A Young Man Who Went Swimming In The Sea - Sakshi
Sakshi News home page

ఆర్కే బీచ్‌: దీపక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Jul 16 2023 5:32 PM | Updated on Jul 16 2023 6:07 PM

RK Beach Life Guards Saved The Life Of Deepak - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆర్కే బీచ్‌లో తృటిలో పెను ‍ప్రమాదం తప్పింది. సరదా కోసం సముద్రంలో ఈతకు దిగిన యువకుడు అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టికుపోయాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన బీచ్‌ లైఫ్‌ గార్డ్స్‌ అతడిని రక్షించారు. 

వివరాల ప్రకారం.. ఈరోజు ఆదివారం కావడంతో ఆర్కే చీచ్‌ వద్దకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక, పలు పక్క రాష్ట్రం ఒడిషా నుంచి కూడా కొందరు పర్యాటకులు అక్కడికి వచ్చారు. కాగా, వీరిలో దీపక్‌(26) అనే వ్యక్తి ఈత కోసం సముద్రంలోకి దిగాడు. సరదాగా ఎంజాయ్‌ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సముద్ర అలలు ఎక్కువయ్యాయి. అలల తాకిడికి దీపక్‌ సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన బీచ్‌ లైఫ్‌ గార్డ్స్‌ దీపక్‌ను రక్షించారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. 

ఇది కూడా చదవండి: నర్సింగ్‌ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement