AP: మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్.. ఎస్‌ఈసీ వివాదాస్పద నిర్ణయం | Rescheduling of municipal elections in AP | Sakshi
Sakshi News home page

AP: మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్.. ఎస్‌ఈసీ వివాదాస్పద నిర్ణయం

Oct 22 2026 10:01 PM | Updated on Oct 22 2026 10:23 PM

 Rescheduling of municipal elections in AP

సాక్షి, అమరావతి: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) రీషెడ్యూల్‌ చేసింది 100 పట్టణ, నగర, స్థానిక సంస్థల ఎన్నికలు రీ షెడ్యూల్‌ చేస్తు‍న్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం(అక్టోబర్‌ 22వ తేదీ) రాత్రి 10గంటల ప్రాంతంలో ప్రకటించింది. నవంబర్‌ 1న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్, 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే నాలుగు మున్సిపాలిటీల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరించాలనే వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 19 మున్సిపాలిటీల్లో టీడీపీ నామినేషన్ల ప్రక్రియను అడ్డుకుని అరాచకం సృష్టిస్తే.. ఎస్‌ఈసీ కేవలం నాలుగు చోట్లే తిరిగి నామినేషన్లు స్వీకరించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 

కడపలో 11 వార్డులు, రాజంపేటలో 11 వార్డులు, తిరుపతిలో 18, మైదుకూరులో మెుత్తం వార్డులకు నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో చాలా చోట్ల నామినేషన్ల అడ్డగింత ప్రక్రియ జరిగితే కేవలం నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్లు తిరిగి స్వీకరించాలనే ఎస్‌ఈసీ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

ఎస్‌ఈసీ  రీషెడ్యూల్‌ చేసిన దాని ప్రకారం.. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ నవంబర్‌ 1కి వాయిదా వేసింది.  దీనిలో భాగంగా ఈనెల 25వ తేదీన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. మైదుకూరు కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం నాలుగు మున్సిపాలిటీల్లోనే నామినేషన్లు తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి: ఫేక్‌ నామినేషన్లు.. టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement