ఫేక్‌ నామినేషన్లు.. టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు! | TDP conspiracies in the nomination process in YSR district | Sakshi
Sakshi News home page

ఫేక్‌ నామినేషన్లు.. టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు!

Oct 22 2026 9:56 PM | Updated on Oct 22 2026 9:56 PM

TDP conspiracies in the nomination process in YSR district

కడప: వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ భారీ కుట్రకు తెరలేపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఫేక్‌ నామినేషన్లు దాఖలు చేస్తూ తమ అరాచకాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది. టీడీపీ నేతనే వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేస్తూ  కోర్టులను మభ్య పెట్టేందుకు యత్నాలు చేస్తుంది. టీడీపీ నేతల అరాచకం ఎలా ఉందంటే  రెండు రోజుల్లో వైఎస్సార్‌ జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలైతే.. అధికారుల జాబితాలో మాత్రం 13 నామినేషన్లు పడ్డట్టు వెల్లడైంది. 

నామినేషన్‌ వేసిన వ్యక్తుల పేర్లను పరిశీలిస్తే అంతా టీడీపీకి చెందిన వారిగా గుర్తించారు. మండల స్థాయిలో ఎంపీటీసీ నామినేషన్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఎస్‌ఈసీకి కడపం ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. 

దౌర్జన్యాలు జరగడం లేదని కోర్టుల ముందు చూపే ప్రయత్నాలే ఫేక్‌ నామినేషన్ల దాఖలకు ప్రధాన కారణంగా కనబడుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు స్వేచ్ఛగా నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారని కోర్టులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ
ఏపీ హైకోర్టులో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న పులివెందుల డీఎస్సీ మురళీనాయక్‌ను తప్పించాలని అవినాష్‌ పిటిషన్‌ వేశారు. దాడులు చేసిన అధికార పార్టీ నాయకులను వదిలేసి.. బాధితులపైన కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement