సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మారనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 1వ తేదీకి మార్చాలని చూస్తున్నట్లు ప్రభుత్వ అనుకూల మీడియా ద్వారా లీకులు వస్తున్నాయి.
అయితే, దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 99 పట్టణ, నగరపాలక సంస్థలకు నవంబర్ 1వ తేదీన పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
మరోవైపు, మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికలను ఇప్పటికే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మైదుకూరులో పరిస్థితుల దృష్ట్యా.. భవిష్యత్తులో మళ్లీ కొత్తగా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించిన తర్వాతే అక్కడ పోలింగ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


