చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు | Chittoor Corporation Elections: Collector issues key orders | Sakshi
Sakshi News home page

చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు

Oct 22 2026 8:23 PM | Updated on Oct 22 2026 9:15 PM

Chittoor Corporation Elections: Collector issues key orders

చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. బలవంతపు ఉపసంహరణలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. దీనిపై విచారణకు ఆదేశించారు కలెక్టర్‌. చిత్తూరు కార్పొరేషన్‌లో 36 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ నామినేషన్లను అధికారులు కుట్ర పూరితంగా తీసేశారు. 

అభ్యర్థుai వెళ్లకుండానే నామినేషన్‌ ఉపసంహరణ కార్యక్రమాన్ని ఆర్వో చేపట్టేశారు. ఏకంగా 36 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోవడం కుట్ర పూరితంగా జరిగిందంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  ఇది కుట్ర పూరిత కోణంలో జరిగిందని, తమకు మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్‌కు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కలెక్టర్‌.. విచారణకు ఆదేశించారు. దీనిపై వాస్తవ నివేదిక ఇవ్వాలంటూ ఆర్వోను ఆదేశించారు కలెక్టర్‌. 

ఇదీ చదవండి: ‘ఎస్‌ఈసీ ఇకనైనా మేల్కోవాలి.. సుప్రీం ఆదేశాలకూ విలువ లేదా?’


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement